Nivetha Peturaj: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

Nivetha Pethuraj turns vegetarian
  • శాకాహారిగా మారిన అందాలతార 
  • కృతిసనన్ తో డ్యాన్స్ కి ప్రభాస్ రెడీ 
  • గోపీచంద్ 'సీటీమార్' రిలీజ్ డేట్  
*  తెలుగు సినిమాలలో కూడా నటిస్తున్న తమిళ కథానాయిక నివేద పేతురాజ్ తాజాగా వెజిటేరియన్ గా మారిపోయింది. ఇలా శాకాహారిగా మారాక తనలో ఎంతో మార్పు కనపడుతోందని నివేద ఆనందంగా చెప్పింది. అలాగే షుగర్ వాడకాన్ని కూడా మానేసి, ఆర్గానిక్ తేనెను వాడటానికి ప్రయత్నిస్తున్నట్టు నివేద చెప్పింది.
*  ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఆదిపురుష్' చిత్రానికి సంబంధించిన షూటింగ్ గత కొన్ని రోజులుగా ముంబైలో జరుగుతోంది. పలువురు ఆర్టిస్టులపై ముఖ్య సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. కాగా, ఈ వారంలోనే ప్రభాస్, కృతిసనన్ జంటపై ఓ పాటను కూడా చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నారట.
*  యాక్షన్ హీరో గోపీచంద్, సంపత్ నంది కలయికలో రూపొందిన 'సీటీమార్' చిత్రం రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 3న థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. ఇందులో తమన్నా కథానాయికగా నటించింది.
Nivetha Peturaj
Prabhas
Kruti Sanan
Gopichand
Tamannaah

More Telugu News