విజయవాడ సీపీ కుమార్తె వివాహ రిసెప్షన్ కు హాజరైన సీఎం జగన్

24-08-2021 Tue 21:23
  • ప్రనీష్ సాయితో బత్తిన శ్రీనివాసులు కుమార్తె పావని పెళ్లి
  • విజయవాడలో రిసెప్షన్ ఏర్పాటు
  • వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్
  • పెళ్లి రిసెప్షన్ కు విచ్చేసిన గవర్నర్ బిశ్వభూషణ్
CM Jagan attends Vijayawada CP daughter wedding reception

ఏపీ సీఎం జగన్ ఇవాళ విజయవాడలో ఓ పెళ్లి విందుకు హాజరయ్యారు. విజయవాడ పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు కుమార్తె పావని మనోజ్ఞ పెళ్లి రిసెప్షన్ ఇవాళ విజయవాడలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన సీఎం జగన్ వధూవరులు పావని మనోజ్ఞ-ప్రనీష్ సాయిలకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. వారికి తన ఆశీస్సులు అందజేశారు. ఈ వివాహ రిసెప్షన్ కు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కూడా హాజరయ్యారు.