KTR: రెండు దశాబ్దాల ప్రస్థానంలో టీఆర్ఎస్ పార్టీ అద్భుత విజయాలు సాధించింది: కేటీఆర్

KTR says TRS registered amazing victories in two decades
  • హైదరాబాదులో టీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ సమావేశం
  • కేసీఆర్ అధ్యక్షతన సమావేశం
  • హాజరైన కేటీఆర్
  • భేటీ వివరాల వెల్లడి
టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశంలో వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రెండు దశాబ్దాల ప్రస్థానంలో టీఆర్ఎస్ ఎన్నో అద్భుత విజయాలు సాధించిందని అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ రాజకీయ శక్తిగా అవతరించిందని తెలిపారు.

దసరా నాటికి జిల్లాల్లో పార్టీ ఆఫీసులు ప్రారంభిస్తామని, ఢిల్లీలోనూ తెలంగాణ భవన్ నిర్మిస్తామని వివరించారు. సెప్టెంబరు 2న ఢిల్లీలో తెలంగాణ భవన్ కు శంకుస్థాపన చేస్తామని కేటీఆర్ వెల్లడించారు. దళితబంధుపై ప్రజలను చైతన్యపరచాలని పార్టీ శ్రేణులకు ఉద్బోధించారు. ప్రజలు తమకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నారని పేర్కొన్నారు.
KTR
TRS
State Committee Meeting
Telangana

More Telugu News