KTR: ఢిల్లీలో కేసీఆర్ చేతుల మీదుగా టీఆర్ఎస్ కార్యాలయానికి భూమి పూజ నిర్వహించనున్నాం: కేటీఆర్

KCR will perform ground breaking ceremony for Delhi TRS office on September 2 says KTR
  • సెప్టెంబర్ 2న ఢిల్లీ కార్యాలయానికి కేసీఆర్ భూమిపూజ నిర్వహిస్తారు
  • అక్టోబరులో 32 జిల్లాల పార్టీ కార్యాలయాలను ప్రారంభిస్తారు
  • తెలంగాణ రాజకీయ క్షేత్రంలో టీఆర్ఎస్ దే తిరుగులేని విజయం
సెప్టెంబర్ 2న ఢిల్లీలో టీఆర్ఎస్ కార్యాలయ నిర్మాణానికి సీఎం కేసీఆర్ చేతుల మీదుగా భూమి పూజను నిర్వహించనున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. అక్టోబరులో 32 జిల్లాల పార్టీ కార్యాలయాలను కేసీఆర్ ప్రారంభిస్తారని చెప్పారు. సెప్టెంబర్ 2న రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు కమిటీల నిర్మాణ ప్రక్రియను ప్రారంభించనున్నామని తెలిపారు. అదే నెలలో జిల్లా కమిటీల ఎంపిక కూడా పూర్తవుతుందని చెప్పారు.

అక్టోబర్ లేదా నవంబర్ నెలల్లో టీఆర్ఎస్ పార్టీ ద్విదశాబ్ది ఉత్సవాలను నిర్వహిస్తామని కేటీఆర్ తెలిపారు. గత రెండు దశాబ్దాల కాలంలో టీఆర్ఎస్ పార్టీ ఎన్నో ఘన విజయాలను సాధించిందని చెప్పారు. తెలంగాణ రాజకీయ క్షేత్రంలో టీఆర్ఎస్ పార్టీదే తిరుగులేని విజయమని అన్నారు. శాసనసభ ఎన్నికల నుంచి జిల్లాపరిషత్, మున్సిపల్, గ్రామ పంచాయతీ అన్నింటిలో టీఆర్ఎస్ తిరుగులేని విజయాలను సాధించిందని చెప్పారు. 119 అసెంబ్లీ స్థానాలకు గాను 88 సీట్లు, 17 పార్లమెంటు స్థానాలకు గాను 9 సీట్లను గెలుచుకున్నామని తెలిపారు.
KTR
KCR
TRS
Delhi TRS Office
District Party Offices

More Telugu News