Google: చేతి వేళ్లకు రెస్ట్.. ఇక ముఖ కవళికలతోనే స్మార్ట్‌ఫోన్ ఆపరేటింగ్!

  • ఆండ్రాయిడ్ 12లో రాబోతున్న కొత్త ఫీచర్
  • డెవలప్ చేస్తున్న గూగుల్
  • బీటా వెర్షన్‌లో ఇప్పటికే అందుబాటులోకి
Googles Android 12 might allow users to control phone with face gestures

స్మార్ట్‌ఫోన్లను ఇప్పటి వరకు చేతి వేళ్లతో ఆపరేట్ చేస్తుండగా, ఇకపై ముఖ కవళికలు, సంజ్ఞలతోనే దానిని నియంత్రించే వెసులుబాటు రాబోతోంది. టెక్ దిగ్గజం గూగుల్ నుంచి త్వరలో రాబోతున్న ఆండ్రాయిడ్ 12 ఓఎస్‌లో ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు గూగుల్ పనిచేస్తున్నట్టు తెలుస్తోంది.

ఇందులోని యాక్సెసిబిలిటీ ఫీచర్ సాయంతో సంజ్ఞలతోనే ఫోన్‌ను నియంత్రించవచ్చు. ఇందులో భాగంగా ‘కెమెరా స్విచెస్ ఫీచర్’ను రాబోయే ఆండ్రాయిడ్ 12 వెర్షన్‌లో డెవలప్ చేస్తోంది. దీని ద్వారా ముఖ కవళికలతోనే స్మార్ట్‌ఫోన్‌ను ఆపరేట్ చేసుకోవచ్చు. అంటే.. నోరు తెరవడం, కుడిఎడమలకు, కిందికి చూడడం వంటి వాటితోనే ఫోన్‌ను నియంత్రించే వీలు కలుగుతుంది.

హోమ్‌పేజీకి వెళ్లడం, వెనుకకు, ముందుకు స్క్రోల్ చేయడం, సెలక్ట్ చేసుకోవడం వంటివి కూడా ఈ ఫీచర్‌లో ఉంటాయి. అలాగే, సంజ్ఞ పరిమాణం, వ్యవధిని కూడా ఎడ్జెస్ట్ చేసుకునేందుకు ఈయాప్ వినియోగదారులను అనుమతిస్తుంది. ప్రస్తుతం ఈ సౌకర్యం బీటా వెర్షన్‌లో అందుబాటులో ఉంది. వైకల్యాలతో ఇబ్బంది పడుతున్న వినియోగదారులకు ఇది చక్కగా ఉపయోగపడుతుందని గూగుల్ పేర్కొంది.

More Telugu News