Rape Case: అత్యాచార బాధితురాలు, అత్యాచార నిందితుడిని 'దేశ భవిష్యత్ సంపద'గా అభివర్ణించిన న్యాయమూర్తి!

  • మద్యం తాగించి అత్యాచారం చేశాడని యువతి ఆరోపణ
  • బెయిలు విచారణ  సందర్భంగా జడ్జి వివాదాస్పద వ్యాఖ్యలు
  • బెయిలు మంజూరు
Future Asset Gauhati HC Grants Bail to  IIT Student Accused in rape case

అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడిని, అత్యాచార బాధితురాలిని ప్రతిభావంతులుగా, ‘దేశ భవిష్యత్ సంపద’గా అభివర్ణించిన గౌహతి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అజిత్ బోర్తాకూర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఈ ఏడాది మార్చి 28న నిందితుడు తనతో మద్యం తాగించి, తాను స్పృహలో లేని సమయంలో అత్యాచారానికి తెగబడ్డాడన్న ఐఐటీ విద్యార్థిని ఫిర్యాదుపై కేసు నమోదైంది. ఏప్రిల్‌లో నిందితుడిని అరెస్ట్ చేశారు. బెయిలు కోసం తాజాగా అతడు దరఖాస్తు చేసుకున్నాడు.

ఈ కేసు విచారణ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. ‘బాధితురాలు, నిందితుడు ఇద్దరూ 21 ఏళ్లలోపు వారేనని, వారు ప్రతిభావంతులనీ, ‘దేశ భవిష్యత్ సంపద’ అని వ్యాఖ్యానించారు. ఈ కేసులో ఇప్పటికే విచారణ పూర్తికావడంతో చార్జిషీటు వేసే వరకు నిందితుడిని జైలులో ఉంచాల్సిన అవసరం లేదని పేర్కొంటూ బెయిలు మంజూరు చేశారు.

More Telugu News