నా బెస్ట్ ఫ్రెండునే పెళ్లి చేసుకుంటున్నాను: హీరో కార్తికేయ

23-08-2021 Mon 21:32
  • ఓ ఇంటివాడవుతున్న కార్తికేయ
  • కాలేజ్ మేట్ తో నిశ్చితార్థం
  • వరంగల్ ఎన్ఐటీలో లోహితతో పరిచయం
  • మరెన్నో దశాబ్దాలు ఇలా సాగిపోవాలంటూ కార్తికేయ ఆకాంక్ష
Hero Karthikeya announces his engagement with college mate
టాలీవుడ్ యువ హీరో కార్తికేయ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. కార్తికేయ నిశ్చితార్థం లోహితా రెడ్డితో ఇటీవల జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలు ఇవాళ సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. కాగా, తన జీవితంలో అత్యంత ముఖ్యమైన ఘట్టంపై హీరో కార్తికేయ స్పందించారు.

"నా బెస్ట్ ఫ్రెండుతోనే నిశ్చితార్థం జరిగిందని ప్రకటించడానికి ఎంతో సంతోషిస్తున్నాను. సన్నిహితురాలే ఇప్పుడు నా జీవిత భాగస్వామి కాబోతోంది. 2010లో లోహితను వరంగల్ ఎన్ఐటీలో కలిశాను. మరెన్నో దశాబ్దాల పాటు మా అనుబంధం ఇలాగే కొనసాగాలని కోరుకోంటున్నాను" అంటూ ట్వీట్ చేశారు.

అంతేకాదు, తాను విద్యార్థిగా ఉన్న సమయంలో లోహితతో కలిసి తీయించుకున్న ఫొటోను కూడా కార్తికేయ పంచుకున్నారు.