Koganti Sathyam: వ్యాపారి కరణం రాహుల్ హత్య కేసు నిందితుడు కోగంటి సత్యం అరెస్ట్

Police arrests Koganti Sathyam in Karanam Rahul murder case
  • ఈ నెల 19న శవమై కనిపించిన రాహుల్
  • బెంగళూరు పారిపోయిన కోగంటి సత్యం
  • అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • విజయవాడ తరలింపు
ఇటీవల విజయవాడలో సంచలనం సృష్టించిన యువ వ్యాపారి కరణం రాహుల్ హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ హత్య కేసులో నిందితుడు కోగంటి సత్యంను అరెస్ట్ చేశారు. రాహుల్ ఓ కారులో శవమై కనిపించిన తర్వాత కోగంటి సత్యం సహా నిందితులు పరారయ్యారు. ఇప్పటికే ప్రధాన నిందితుడు కోరాడ విజయ్ కుమార్ పోలీసులకు లొంగిపోగా, కోగంటి సత్యంను పోలీసులు బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. అతడిని బెంగళూరు నుంచి విజయవాడ తీసుకువస్తున్నారు. కోగంటి సత్యం నుంచి రాబట్టే సమాచారంతో కేసు దర్యాప్తు దాదాపుగా ఓ కొలిక్కి వస్తుందని భావిస్తున్నారు.
Koganti Sathyam
Arrest
Police
Bengaluru
Karanam Rahul
Murder
Vijayawada

More Telugu News