Andhra Pradesh: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు పోలీసుల దుర్మరణం

Four police dead in road accident in Andhra Pradesh
  • శ్రీకాకుళం జిల్లా పలాస మండలంలో ఘోర ప్రమాదం
  • ఏఆర్ పోలీసులు ప్రయాణిస్తున్న బొలెరో వాహనానికి యాక్సిడెంట్
  • అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన కానిస్టేబుళ్లు
ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు పోలీసులు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన పలాస మండలం సుమ్మాదేవి జాతీయ రహదారిపై జరిగింది. బొలెరో వాహనంలో ఏఆర్ కానిస్టేబుళ్లు వెళ్తుండగా ప్రమాదం సంభవించింది.

ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా... పలువురు గాయపడ్డారు. గాయపడిన వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలిసిన వెంటనే పోలీసు ఉన్నతాధికారులు అక్కడకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
Andhra Pradesh
Road Accident
Police
Dead
Srikakulam District
Palasa

More Telugu News