కల్యాణ్ సింగ్ తన పేరును సార్థకం చేసుకున్నారు: ప్రధాని మోదీ
- లోక కల్యాణం కోసం పాటుపడ్డారని కితాబు
- ప్రజాక్షేమమే పరమావధిగా బతికారని వెల్లడి
- నిన్న తుదిశ్వాస విడిచిన కల్యాణ్ సింగ్
- లక్నోలో నివాళులు అర్పించిన ప్రధాని మోదీ
కల్యాణ్ సింగ్ విలువైన వ్యక్తిత్వం ఉన్న మనిషి అని, ఎంతో సమర్థుడైన నేత అని కొనియాడారు. నమ్మకానికి ప్రతిరూపంగా సామాన్య ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్నారని వెల్లడించారు. దేశం ఒక మంచి నాయకుడ్ని కోల్పోయిందని, ఆయన లేని లోటును తీర్చాలంటే, ఆయన ఆదర్శాలు, హామీలను నెరవేర్చడమే మార్గమని అన్నారు. అందుకు తీవ్రంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
"తల్లిదండ్రులు ఆయనకు కల్యాణ్ సింగ్ అని పేరుపెట్టారు. ఆ పేరును సార్థకం చేసుకుంటూ లోక కల్యాణం కోసం అహర్నిశలు పాటుపడ్డారు. తన జీవితాన్ని బీజేపీ కోసం, భారతీయ జన్ సంఘ్ పరివారం కోసం అంకితమిచ్చారు" అని ప్రస్తుతించారు.