Mohan Babu: 'మా' జనరల్ బాడీ సమావేశంలో మోహన్ బాబు తీవ్ర వ్యాఖ్యలు!

Mohan Babu comments on MAA building issue
  • హైదరాబాదులో 'మా' సర్వసభ్య సమావేశం
  • హాజరైన మోహన్ బాబు
  • 'మా' కోసం స్థలం కొని అమ్మేశారని ఆరోపణ
  • పెద్దలు ఆలోచించాలని వ్యాఖ్యలు
ఇవాళ జరిగిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) సర్వసభ్య సమావేశంలో సీనియర్ నటుడు మోహన్ బాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 'మా'కు సొంత భవనమే ప్రధాన అజెండాగా ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

"భవనం కోసం స్థలం కొన్నారు... అమ్మేశారు. రూపాయికి కొన్న స్థలాన్ని అర్ధరూపాయికి అమ్మేశారు. ఇది ఎంతవరకు సబబు? దాని గురించి ఎవరైనా మాట్లాడారా? ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉన్నారు. 'మా'కు సొంత భవనం కోసం కేటాయించిన సొమ్ముతో స్థలం కొని దాన్ని సగం ధరకే అమ్మేయడంపై సినీ పెద్దలు ఆలోచించాలి" అని వ్యాఖ్యానించారు.
Mohan Babu
MAA Building
Meeting
Tollywood

More Telugu News