Devineni Uma: ఈ పేదలకు సమాధానం చెప్పండి వైఎస్ జ‌గ‌న్: దేవినేని ఉమ

devineni uma slams jagan
  • ఇళ్ల‌ నిర్మాణంలో మూడో ఆప్షన్ ఎన్నుకున్న లబ్ధిదారులకు బెదిరింపులు
  • బలవంతంగా మొదటి రెండు ఆప్షన్ లలోకి
  • ఒప్పుకోకపోతే స్థలం కూడా రాదని వాలంటీర్ లతో హెచ్చరికలు
  • బెదిరింపుల‌కు దిగడం ఏంటి? అంటున్న పేదలు
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌పై ఏపీ మాజీ మంత్రి దేవినేని ఉమా మ‌హేశ్వ‌ర‌రావు మండిప‌డ్డారు. ఇళ్ల‌ నిర్మాణంలో మూడో ఆప్షన్ ఎన్నుకున్న లబ్ధిదారులకు వాలంటీర్ల నుంచి బెదిరింపులు ఎదుర‌వుతున్నాయ‌ని ఆయ‌న చెబుతూ ఓ వీడియో పోస్ట్ చేశారు.

'ఇళ్ల‌ నిర్మాణంలో మూడో ఆప్షన్ ఎన్నుకున్న లబ్ధిదారులకు బెదిరింపులు. బలవంతంగా మొదటి రెండు ఆప్షన్ లలోకి, ఒప్పుకోకపోతే స్థలంకూడా రాదని వాలంటీర్ లతో హెచ్చరికలు. ఎన్నికలముందు మేమే ఇళ్లు కట్టిస్తామని చెప్పి మోసంచేసి.. నేడు మాపై బెదిరింపులకు దిగడం ఏంటి? అంటున్న పేదలకు సమాధానం చెప్పండి' వైఎస్ జ‌గ‌న్ అని దేవినేని ఉమ నిల‌దీశారు.


Devineni Uma
Telugudesam
YSRCP
Jagan

More Telugu News