నేత‌ల ఆడియో టేపులపై విచార‌ణ అవ‌స‌రం: వాసిరెడ్డి ప‌ద్మ‌

22-08-2021 Sun 12:59
  • ఆ మాట‌లు త‌మ‌వికావని నేత‌లు అంటున్నారు
  • నేత‌ల వ్య‌వ‌హారంపై విచార‌ణ జ‌ర‌పాల్సిన అవ‌స‌రం ఉంది
  • వారి ఆడియో టేపుల ఘ‌ట‌న‌పై విచార‌ణ కోర‌తాం
vasi reddy padma on audio tapes

ప‌లువురు నేత‌ల ఆడియో టేపుల క‌ల‌కలం, బీటెక్ విద్యార్థిని ర‌మ్య హ‌త్య ఘ‌ట‌న‌ల‌పై ఆంధ్ర‌ప్ర‌దేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ స్పందించారు. నేత‌ల ఆడియో టేపులపై విచార‌ణ అవ‌సర‌మ‌ని చెప్పారు. టేపుల్లోని ఆ మాట‌లు త‌మ‌వి కావని నేత‌లు అంటున్నారని, నేత‌ల వ్య‌వ‌హారంపై విచార‌ణ జ‌ర‌పాల్సిన అవ‌స‌రం ఉందని తెలిపారు. వారి ఆడియో టేపుల ఘ‌ట‌న‌పై విచార‌ణ కోర‌తామ‌ని తెలిపారు.
 
కాగా, మ‌హిళా క‌మిష‌న్ త‌ర‌ఫున స‌మాచారం తెప్పించుకుంటామ‌ని వాసిరెడ్డి ప‌ద్మ చెప్పారు. అస‌భ్యక‌ర ప్ర‌వ‌ర్త‌న‌పై మ‌హిళా క‌మిష‌న్ చూస్తూ ఊరుకోదని అన్నారు. ర‌మ్య ఘ‌ట‌నపై టీడీపీ 21 రోజుల డెడ్‌లైన్ ఇవ్వడం స‌రికాదని తెలిపారు. నిందితుల‌పై ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటుందని చెప్పారు.