హైద‌రాబాద్ వ్యాపారి కిడ్నాప్‌, హ‌త్య‌.. సంగారెడ్డికి తీసుకెళ్లి పూడ్చిపెట్టిన వైనం

22-08-2021 Sun 12:14
  • చార్మినార్‌కు చెందిన వ్యాపార‌వేత్త‌
  • ఈ నెల 19న మ‌ధుసూద‌న్‌రెడ్డిని కిడ్నాప్ చేసిన ముగ్గురు వ్య‌క్తులు
  • ఆయ‌న వ‌ద్ద రూ.40 ల‌క్ష‌లు అప్పుగా తీసుకున్న మిత్రులు
  • డ‌బ్బులు తిరిగి ఇవ్వాల‌ని అడిగితే కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన వైనం
business man kills by his friends

హైద‌రాబాద్‌కు చెందిన ఓ వ్యాపారిని కిడ్నాప్ చేసి హ‌త్య చేసి పూడ్చిపెట్టారు కొంద‌రు వ్య‌క్తులు. కిడ్నాప్ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ఓ నిందితుడిని అరెస్టు చేశారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. హైద‌రాబాద్‌లోని చార్మినార్‌కు చెందిన వ్యాపార‌వేత్త మ‌ధుసూద‌న్ రెడ్డి వ‌ద్ద ఆయ‌న మిత్రులు రూ.40 ల‌క్ష‌లు అప్పుగా తీసుకున్నారు.

డ‌బ్బులు తిరిగి ఇవ్వాల‌ని వారిని మ‌ధుసూద‌న్ రెడ్డి అడిగారు. దీంతో డ‌బ్బులు ఎగ్గొట్ట‌డానికి మ‌ధుసూద‌న్ రెడ్డిని కిడ్నాప్ చేసి సంగారెడ్డికి తీసుకెళ్లిన ఆ ముగ్గురు వ్య‌క్తులు ఆయ‌న‌ను హ‌త్య చేసి పూడ్చిపెట్టారు. దీనిపై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించి నిందితుల్లో ఒకరిని అరెస్టు చేశారు. ఈ ఘ‌ట‌న‌లో త‌దుపరి విచార‌ణ జ‌రుపుతున్నారు.