మెగాస్టార్ 'భోళా శంకర్' టైటిల్ మోషన్ పోస్టర్ ను విడుదల చేసిన మహేశ్ బాబు

22-08-2021 Sun 10:09
  • చిరంజీవి 154 చిత్రం 'భోళా శంకర్'
  • మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా టైటిల్ పోస్టర్ విడుదల
  • పోస్టర్ విడుదల చేయడాన్ని గౌరవంగా భావిస్తున్నానన్న మహేశ్ బాబు
Chiranjeevi Bhola Shankar movie title motion poster unveiled by Mahesh Babu

మెగాస్టార్ చిరంజీవి 154వ చిత్రానికి సంబంధించిన అప్డేట్ వచ్చేసింది. మెహర్ రమేశ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'భోళా శంకర్' పేరును ఖరారు చేశారు. తమిళ బ్లాక్ బస్టర్ మూవీ 'వేదాళం' సినిమాను 'భోళా శంకర్' పేరుతో తెరకెక్కించనున్నారు. తమిళ వర్షన్ లో అజిత్ హీరోగా నటించాడు. మరోవైపు 'భోళా శంకర్' సినిమా టైటిల్ మోషన్ పోస్టర్ ను సూపర్ స్టార్ మహేశ్ బాబు విడుదల చేశారు. 'హ్యాపీ బర్త్ డే చిరంజీవి గారు. 'భోళా శంకర్' టైటిల్ ను విడుదల చేయడం గౌరవంగా భావిస్తున్నా. ఈ సంవత్సరం మీకు ఆరోగ్యాన్ని, ఘన విజయాలను ఇవ్వాలని కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్ సార్' అని మహేశ్ బాబు ట్వీట్ చేశారు.

వాస్తవానికి ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ నటించాల్సి ఉంది. అయితే, గత కొన్ని సంత్సరాలుగా ఇది పెండింగ్ లో ఉంటూనే వచ్చింది. చివరకు చిరంజీవి ఈ రీమేక్ చేయబోతున్నారు. ఈ చిత్రంలో చిరంజీవి సోదరిగా కీర్తి సురేశ్ నటించబోతున్నట్టు సమాచారం.