Pawan Kalyan: రాఖీబంధన్ శుభాకాంక్షలు తెలిపిన పవన్ కల్యాణ్, షర్మిల

  • బాంధవ్యాలను తెలిపే పండుగే రక్షాబంధన్ అన్న పవన్
  • అడపిల్లలపై  జరుగుతున్న దురాగతాలు బాధను కలిగిస్తున్నాయని వ్యాఖ్య
  • ప్రతి అన్న, తమ్ముడు సంతోషంగా ఉండాలన్న షర్మిల
Pawan Kalyan and Sharmila greetings on Raksha Bandhan

రాఖీ బంధన్ సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు జనసేనాని పవన్ కల్యాణ్, వైయస్సార్టీపీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల శుభాకాంక్షలు తెలిపారు. భారతీయుల బాంధవ్యాలను తెలిపే వేడుకే రక్షా బంధన్ అని పవన్ తెలిపారు. అత్యాచారాలను అడ్డుకోగలగడమే నిజమైన రక్షాబంధన్ అని చెప్పారు. ఆడపిల్లలపై జరుగుతున్న దురాగతాలు బాధను కలిగిస్తున్నాయని... ఇటీవల జరిగిన సంఘటనలు మనసును కలచివేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆడపిల్లలంతా మన అక్కాచెల్లెల్లే అనే భావన అందరిలో రావాలని చెప్పారు. మహిళలు, అమ్మాయిలు నిర్భయంగా తిరిగేలా వారికి భరోసా ఇవ్వాలని అన్నారు.

తన తోడబుట్టిన జగనన్నకు, తాను నమ్మిన సిద్ధాంతం కోసం తనకు అండగా నిలిచిన, తాను ఎంచుకున్న మార్గంలో తనతో కలిసి నడుస్తున్న, తన ఆశయ సాధనలో తనను నిలబెడుతున్న ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి సుఖసంతోషాలు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని షర్మిల చెప్పారు.

సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ కూడా రాఖీ పండుగ శుభాకాంక్షలను తెలియజేశారు. అన్ని విషయాల్లో సగభాగమైన మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరగుతుండటం బాధను కలిగిస్తోందని అన్నారు. ఆడవారు అబలలు కాదు సబలలు అని నిరూపించాల్సిన అవసరం ఉందని చెప్పారు.

More Telugu News