Jagan: ప్రజలకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు చెప్పిన జగన్, కేసీఆర్, చంద్రబాబు

jagan kcr and chandrababu wishes people on the occasion of rakhi purnima
  • భారతీయ సంప్రదాయ ఔన్నత్యానికి ప్రతీక: కేసీఆర్
  • మహిళా సాధికారతకు కృషి: జగన్
  • కులమతాలకు రాఖీ పండుగ అతీతం: చంద్రబాబు
రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి వైఎస్ జగన్, కేసీఆర్‌తోపాటు టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రక్షాబంధన్ భారతీయ సంప్రదాయ ఔన్నత్యానికి ప్రతీక అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఏపీ ప్రజలకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్.. మహిళా సాధికారతకు ఏపీ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు. మహిళలు అన్ని రంగాల్లోనూ ఎదిగేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు.

టీడీపీ చీఫ్ నారా చంద్రబాబునాయుడు మాట్లాడుతూ.. కులమతాలకు రాఖీ పండుగ అతీతమని చెప్పారు. మానవీయ సంబంధాలను రాఖీ పండుగ మరింత పటిష్టం చేస్తుందన్నారు. భారతీయ జీవన ఔన్నత్యానికి రక్షాబంధన్ నిదర్శనమని పేర్కొన్నారు. 
Jagan
KCR
Chandrababu
Rakhi Pournami

More Telugu News