TSRTC: నాలుగు నెలల్లో రూ. 900 కోట్లు నష్టపోయిన టీఎస్ ఆర్టీసీ

  • కరోనాకు తోడు పెరిగిన డీజిల్ ధరలతో నష్టాలు
  • నెలకు రూ. 225 కోట్లు నష్టపోయిన ఆర్టీసీ
  • ఆదుకోవాలంటూ ప్రభుత్వానికి విన్నపం
TSRTC gets 900 Cr losses in 4 months

తెలంగాణ ఆర్టీసీ ఎప్పటి నుంచో తీవ్ర నష్టాల్లో కొనసాగుతోంది. దీంతో కిలోమీటర్ కు 20 పైసలు చెప్పున టికెట్ ధర పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో... ఆర్టీసీ ఆదాయం ఒక్కసారిగా పెరగడం ప్రారంభమయింది. రోజువారీ ఆదాయం రూ. 14 కోట్లకు చేరుకోవడంతో సంస్థ బ్రేక్ ఈవెన్ కు చేరుకుంది. అయితే అంతా బాగుందనే సమయంలో కరోనా వచ్చి పడింది. దీనికి తోడు డీజిల్ ధరలు పెరగడం కూడా సంస్థను మళ్లీ దెబ్బతీసింది.

ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జులై వరకు ఆర్టీసీకి రూ. 900 కోట్ల మేర నష్టాలు వచ్చాయి. సగటున ప్రతి నెల ఆర్టీసీ రూ. 225 కోట్లు నష్టపోయింది. దీంతో తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని ఆర్టీసీ కోరుతోంది. వీలైనంత త్వరలో టికెట్ ధరలను పెంచి కొంతైనా ఆదుకోవాలని విన్నవిస్తోంది.

More Telugu News