CM KCR: 'రక్షా బంధన్' శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ సీఎం కేసీఆర్

Telangana CM KCR conveys Raksha Bandhan wishes
  • ఆదివారం రాఖీ పౌర్ణమి
  • సహోదరత్వానికి ప్రతీకగా అభివర్ణించిన కేసీఆర్
  • భారతీయ ఔన్నత్యానికి నిదర్శనమని వెల్లడి
  • తెలంగాణ ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్ష
ఆదివారం 'రక్షాబంధన్' పర్వదినం కావడంతో దేశవ్యాప్తంగా సందడి వాతావరణం కనిపిస్తోంది. సోదర సోదరీ బంధానికి ప్రతీకలా నిలిచే ఈ పండుగ నేపథ్యంలో శనివారం నాడే రాఖీ దుకాణాలు, స్వీట్ షాపుల వద్ద రద్దీ కనిపించింది. కాగా, రాఖీ పండుగను పురస్కరించుకుని సీఎం కేసీఆర్ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు.

'రక్షాబంధన్' ను దేశవ్యాప్తంగా జరుపుకుంటారని, సహోదరత్వానికి ఈ పండుగ నిదర్శనంలా నిలుస్తుందని అభివర్ణించారు. ఇదొక గొప్ప సందర్భమని, జీవితకాలం పాటు తమ అనుబంధం కొనసాగాలని కోరుకుంటూ అన్నదమ్ముల చేతికి మమతానురాగాలతో రక్షా బంధనాన్ని కడతారని రాఖీ పండుగ ప్రాశస్త్యాన్ని సీఎం కేసీఆర్ వివరించారు. భారత ప్రజల జీవన ఔన్నత్యం ఈ పండుగ ద్వారా వెల్లడవుతుందని తెలిపారు.
CM KCR
Rakshabandhan
Wishes
Telangana

More Telugu News