Nurse: బుల్లెట్టు బండి పాటకు డ్యాన్స్ చేసిన నర్సు... మెమో జారీ చేసిన అధికారులు

Nurse dances for Bullet Bandi song
  • ఇటీవల 'బుల్లెట్టు బండి' పాటకు కొత్త జంట డ్యాన్స్
  • వైరల్ అయిన వీడియో
  • అదే స్ఫూర్తితో నర్సు డ్యాన్స్
  • తీవ్రంగా పరిగణించిన అధికారులు
ఇటీవల ఓ కొత్త జంట తమ పెళ్లి ఊరేగింపులో 'నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా పా' అనే ఫోక్ సాంగ్ కు డ్యాన్స్ చేయడం వైరల్ అయింది. ఇప్పుడదే స్ఫూర్తితో 'బుల్లెట్టు బండి' పాటకు డ్యాన్స్ చేసి ఓ నర్సు చిక్కుల్లో పడింది. తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి ప్రజా ఆరోగ్య కేంద్రంలో ఒప్పంద నర్సుగా పనిచేస్తున్న రజని అనే యువతి ఆగస్టు 15న విధి నిర్వహణలో ఉండి 'బుల్లెట్టు బండి' పాటకు డ్యాన్స్ చేసింది. ఈ వీడియో వైరల్ కావడంతో అధికారుల దృష్టికి వెళ్లింది.

స్వాతంత్ర్య దినోత్సవం నాడే ఇలా చేయడం, పైగా విధుల్లో ఉండడంతో ఈ విషయాన్ని అధికారులు తీవ్రంగా పరిగణించారు. జిల్లా మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ సుమన్ మోహన్ రావు ఈ ఘటనలో సదరు నర్సుకు మెమో జారీ చేశారు. కాగా, దీనిపై నర్సు రజని స్పందిస్తూ, తాను విధులను నిర్లక్ష్యం చేయలేదని, ఇతర ఉద్యోగులు ప్రోత్సహించడంతో డ్యాన్స్ చేశానని వివరించింది.
Nurse
Bullet Bandi Song
PHC
Memo
Rajanna Sircilla District
Telangana

More Telugu News