విజయవాడలో చార్టర్డ్ అకౌంటెంట్ చెరుకూరి సింధు అనుమానాస్పద మృతి

21-08-2021 Sat 19:42
  • విజయవాడలో ఘటన
  • ఇది హత్యేనంటున్న సింధు తల్లిదండ్రులు
  • ప్రసేన్ అనే వ్యక్తితో కలిసుంటున్న సింధు
  • ఇరువురి ప్రేమకు అంగీకరించని పెద్దలు
Vijayawada chartered accountant Cherukuri Sindhu dies in suspicious conditions

విజయవాడలో చార్టర్డ్ అకౌంటెంట్ చెరుకూరి సింధు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందింది. అయితే తమ కుమార్తెది హత్యేనని సింధు తల్లిదండ్రులు అంటున్నారు. సింధును ఆమె సన్నిహితుడు ప్రసేన్ అనే వ్యక్తి చంపాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

సింధు, ప్రసేన్ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వారి ప్రేమకు రెండు కుటుంబాల పెద్దలు అంగీకరించలేదు. లాక్ డౌన్ అనంతరం ప్రసేన్ ఇంట్లోనే సింధు ఉంటోంది. అయితే, ఇప్పుడు సింధు మరణించడంతో ఆమె తల్లిదండ్రులు ప్రసేన్ వైపు వేలెత్తి చూపిస్తున్నారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని వారు ఎంపీ కేశినేని నానిని కోరారు. ఈ క్రమంలో విజయవాడ సీపీని కలిసి ఈ ఘటనపై ఫిర్యాదు చేయాలని సింధు తల్లిదండ్రులు నిర్ణయించుకున్నారు.