Jogi Ramesh: ఎస్సీ, బీసీ, మైనారిటీలు ఓ కుటుంబంలా కలిసి ఉండడాన్ని చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు: జోగి రమేశ్

  • చంద్రబాబుపై జోగి ఫైర్
  • కులాల మధ్య చిచ్చుపెడుతున్నాడని వ్యాఖ్యలు
  • తాలిబన్లకు చంద్రబాబు అధ్యక్షుడని విమర్శలు
  • సీఎం వ్యాఖ్యలు వక్రీకరిస్తున్నారని ఆరోపణ
Jogi Ramesh fires on TDP president Chandrababu

టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఏపీలో ఎస్సీ, బీసీ, మైనారిటీలు ఓ కుటుంబంలా కలిసి ఉండడాన్ని చంద్రబాబు తట్టుకోలేకపోతున్నాడని విమర్శించారు. అందుకే కులాల మధ్య విభేదాలు రగిల్చేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.

దళితుల్లో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా? అంటూ వ్యాఖ్యానించిన చంద్రబాబును ఏంచేయాలని జోగి రమేశ్ ప్రశ్నించారు. విశ్వబ్రాహ్మణుల తోకలు కత్తిరిస్తా, అగ్నికుల క్షత్రియులను తరిమికొడతానని వ్యాఖ్యానించారని ఆరోపించారు.

టీడీపీ ప్రస్తుతం తెలుగు తాలిబన్ పార్టీగా మారిందని, ఆ తాలిబన్ పార్టీకి చంద్రబాబే అధ్యక్షుడని అభివర్ణించారు. సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి టీడీపీ ఓర్వలేకపోతోందని విమర్శించారు. అందుకే సీఎం జగన్ వ్యాఖ్యలను ఆ పార్టీ నేతలు వక్రీకరిస్తున్నారని జోగి రమేశ్ మండిపడ్డారు.

More Telugu News