Indira Shobhan: ఇందిరా శోభన్ వైయస్సార్టీపీని వీడినా పార్టీకి నష్టం లేదు: దేవేందర్ రెడ్డి

YSRTP response on resignation of Indira Shobhan
  • వైయస్సార్టీపీకి ఇందిరా శోభన్ రాజీనామా
  • చేరికలు, వెళ్లిపోవడాలు రాజకీయాల్లో సహజమన్న దేవేందర్ రెడ్డి
  • ఆమెకు ఎక్కడా తక్కువ చేయలేదని వ్యాఖ్య

వైయస్సార్టీపీకి ఆ పార్టీ కీలక నేత ఇందిరా శోభన్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిలకు తన రాజీనామా లేఖను ఆమె పంపించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల కోరిక మేరకు పార్టీని వీడుతున్నానని ఆమె తెలిపారు. రాష్ట్ర ప్రజల కోసం తన పోరాటం కొనసాగుతూనే ఉంటుందని చెప్పారు. ఆమె మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకే వెళ్లనున్నారనే ప్రచారం జరుగుతోంది.

మరోవైపు ఇందిర రాజీనామా అంశంపై ఆ పార్టీ నేత దేవేందర్ రెడ్డి స్పందించారు. ఆమె వెళ్లిపోయినా పార్టీకి వచ్చే నష్టం ఏమీ లేదని అన్నారు. చేరికలు, వెళ్లిపోవడాలు రాజకీయాల్లో సహజమని అన్నారు. పార్టీలో ఆమెకు ఎక్కడా తక్కువ చేయలేదని... సముచిత స్థానాన్ని కల్పించినా ఆమె పార్టీని వీడారని చెప్పారు. కార్యకర్తలను నాయకులుగా చేసుకోవడమే తమ లక్ష్యమని అన్నారు.

  • Loading...

More Telugu News