Afghanistan: ఆఫ్ఘనిస్థాన్‌లో చిక్కుకున్న తెలుగువారి కోసం హెల్ప్‌ డెస్క్ ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం

  • ఆఫ్ఘనిస్థాన్ లో చిక్కుకున్న ఎందరో భారతీయులు
  • తెలుగువారిని రప్పించేందుకు ప్రభుత్వ చర్యలు
  • హెల్ప్ డెస్క్ నంబర్లకు ఫోన్ చేసి వివరాలను తెలియజేయవచ్చన్న ప్రభుత్వం
AP Govt set help desk for telugu people who are in Afghanistan

ఆఫ్ఘనిస్థాన్ లో మన భారతీయులు ఎంతోమంది చిక్కుకుపోయారు. సురక్షితంగా స్వదేశానికి చేరుకోగలమా? అనే ఆందోళనలో వారున్నారు. వీరిని వెనక్కి రప్పించేందుకు భారత ప్రభుత్వం కృషి చేస్తోంది.

మరోవైపు ఆప్ఘన్ లో చిక్కుకుపోయిన తెలుగువారిని సురక్షితంగా వెనక్కి రప్పించేందుకు ఏపీ ప్రభుత్వం కూడా చర్యలు చేపట్టింది. వీరి కోసం కార్మికశాఖలో ప్రత్యేక హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేసింది. అక్కడ చిక్కుకుపోయిన తెలుగువారు హెల్ప్ డెస్క్ లోని 0866-2436314, 7780339884, 9492555089 నంబర్లకు ఫోన్ చేసి వారి వివరాలను తెలియజేయవచ్చని చెప్పారు.

మరోవైపు భారత ప్రభుత్వం కూడా అక్కడ చిక్కుకున్నవారికోసం హెల్ప్ లైన్ నంబర్లను ఏర్పాటు చేసింది. ఈ నంబర్లను సంప్రదించడం ద్వారా ప్రభుత్వ సహాయాన్ని పొందవచ్చు. అంతేకాదు ఇండియాకు రావాలనుకునే ఆఫ్ఘనీలకు ప్రత్యేక వీసాలను జారీ చేసేందుకు కేంద్రం అంగీకరించింది.

భారత ప్రభుత్వ హెల్ప్ లైన్ నంబర్లు:
ఫోన్: 91 11 4901 6783 .... 91 11 4901 6784 .... 91 11 49016785.
వాట్సాప్: 91 8010611290 .... 91 9599321199 .... 91 7042049944.

More Telugu News