Chiranjeevi: చిరూ 153వ సినిమా టైటిల్ గా 'గాడ్ ఫాదర్' .. అధికారిక ప్రకటన!

Chiranjeevi new movie title is revealed
  • చిరంజీవితో 'లూసిఫర్' రీమేక్  
  • దర్శకుడిగా మోహన్ రాజా 
  • బర్త్ డే సందర్భంగా టైటిల్ ప్రకటన   
  • త్వరలో రెగ్యులర్ షూటింగ్
చిరంజీవి కథానాయకుడిగా .. ఆయన 153వ సినిమాగా 'లూసిఫర్' రీమేక్ రూపొందనుందనే వార్త వచ్చిన దగ్గర నుంచి అందరిలో ఆసక్తి మొదలైంది. ఎందుకంటే మలయాళంలో మోహన్ లాల్ హీరోగా చేసిన 'లూసిఫర్' సంచలన విజయాన్ని నమోదు చేసింది. అంతేకాదు ఆయన కెరియర్లోనే చెప్పుకోదగిన సినిమాగా నిలిచింది.

దాంతో ఈ కథ పట్ల చిరంజీవి ఉత్సాహాన్ని చూపించారు. ఇక, అప్పటి నుంచీ అందుకు సంబంధించిన పనులు చకచకా జరిగిపోతూ వచ్చాయి. ఈ సినిమాను నిర్మించడానికి చరణ్ తో పాటు ఆర్ బీ చౌదరీ .. ఎన్వీ ప్రసాద్ రంగంలోకి దిగిపోయారు. భారీ యాక్షన్ సినిమాలను చాలా స్టైలిష్ గా .. డీసెంట్ గా ప్రెజెంట్ చేయగల మోహన్ రాజాకి దర్శకత్వ బాధ్యతలను అప్పగించారు.

తెలుగు నేటివిటీకి తగినట్టుగా ఆయన కొన్ని మార్పులు చేర్పులు చేసి, ఈ కథను ఓ కొలిక్కి తెచ్చాడు. ఈ సినిమాకి 'గాడ్ ఫాదర్' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. చిరంజీవి బర్త్ డే సందర్భంగా అదే టైటిల్ ను ఖరారు చేసి, అధికారిక పోస్టర్ ను వదిలారు. టైటిల్ ను డిజైన్ చేయించిన తీరు .. చిరూ లుక్ కొత్తగా .. ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.
Chiranjeevi
Mohan Raja
Thaman

More Telugu News