Vijayasai Reddy: బుచ్చయ్య రాజీనామా చేస్తారో లేదో కానీ ఆయన చెప్పిన నిజాలు ఆసక్తికరం: విజయసాయిరెడ్డి

Vijayasai Reddy opines on Buthcaiah episode
  • టీడీపీలో బుచ్చయ్యచౌదరి కలకలం
  • రాజీనామా చేస్తారంటూ ప్రచారం
  • బుజ్జగించిన టీడీపీ హైకమాండ్
  • స్పందించిన విజయసాయి
కొన్నిరోజుల కిందట టీడీపీలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి కలకలం రేపారు. ఆయన రాజీనామా చేస్తారంటూ ప్రచారం జరిగింది. దాంతో టీడీపీ నేతలు గోరంట్లను బుజ్జగించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఈ నేపథ్యంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. బుచ్చయ్య రాజీనామా చేస్తారో లేదో కానీ, ఆయన చెప్పిన నిజాలు మాత్రం ఆసక్తికరంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు.

"నాడు వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీలోకి తీసుకోవడం పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తే బాబు రెండేళ్లు తనతో మాట్లాడలేదట. కానీ ప్రజలు బాబును ఐదేళ్లు తరిమారు. సూపర్ తీర్పు కదా!" అని విజయసాయి ట్వీట్ చేశారు.
Vijayasai Reddy
Butchaiah
TDP
Babu
Andhra Pradesh

More Telugu News