Paritala Siddhartha: పరిటాల సిద్ధార్థ్ వద్ద దొరికిన బుల్లెట్ సైన్యం వాడేదట!

  • శంషాబాద్ విమానాశ్రయంలో సిద్ధార్థ్ బ్యాగులో బుల్లెట్ లభ్యం
  • సైనికులు వాడే ఇన్సాస్ రైఫిల్స్ బుల్లెట్ గా గుర్తింపు
  • సిద్ధార్థ్ కు ఈ బుల్లెట్ ఎలా వచ్చిందనే దానిపై విచారణ ప్రారంభం
Paritala Siddharth bullet case updates

దివంగత పరిటాల రవి చిన్న కుమారుడు పరిటాల సిద్దార్థ్ మరింత చిక్కుల్లో కూరుకుపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో సిద్ధార్థ్ బుల్లెట్ తో పట్టుబడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుల్లెట్ ను ఎయిర్ పోర్ట్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు వివరణ ఇవ్వాలంటూ సిద్ధార్థ్ కు నోటీసులు ఇచ్చారు.

వాస్తవానికి సిద్ధార్థ్ కు పాయింట్ 32 క్యాలిబర్ గన్ కు లైసెన్స్ ఉంది. అయితే సిద్ధార్థ్ బ్యాగులో లభ్యమైన బుల్లెట్ 5.56 క్యాలిబర్. ఇప్పుడు ఇదే సిద్ధార్థ్ కు ఇబ్బందులు తీసుకురాబోతోంది. సైనికులు వాడే ఇన్సాస్ రైఫిల్స్ లో ఈ బుల్లెట్లను వాడతారు. దీంతో, ఈ బుల్లెట్ సిద్ధార్థ్ కు ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై విచారణ ప్రారంభమైనట్టు సమాచారం. ఈ బుల్లెట్ అనంతపురం జిల్లాకు చెందిన ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (సైన్యంలో ఒక విభాగం)లో పని చేస్తున్న ఒక సైనికుడిదని చెపుతున్నారు. పరిటాల కుటుంబంతో సదరు వ్యక్తికి పరిచయం ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

More Telugu News