విజయ్ మాల్యా పారిపోయినట్టు 2023లో కేసీఆర్ కుటుంబ సభ్యులు దేశం విడిచి పారిపోతారు: బీజేపీ ఎంపీ అరవింద్

21-08-2021 Sat 14:55
  • కేసీఆర్ కుటుంబంపై అరవింద్ విమర్శలు
  • కోట్లు సంపాదించారన్న ఎంపీ
  • ప్రజలను బకరా చేస్తున్నారని వ్యాఖ్యలు
  • సోమేశ్ కుమార్ అబద్ధాలు చెబుతున్నారని ధ్వజం
MP Arvind slams KCR family members

తెలంగాణ సీఎం కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులపై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కుటుంబం రూ.1.70 లక్షల కోట్లు సంపాదించిందని ఆరోపించారు. విజయ్ మాల్యా పారిపోయినట్టు 2023లో కేటీఆర్, కవిత, సంతోష్, హరీశ్ రావు విదేశాలకు పారిపోతారని అరవింద్ జోస్యం చెప్పారు. గెలిచే చోటుకు కొడుకుని, గెలవని చోటుకు హరీశ్ రావును పంపి బకరా చేస్తున్నారని వెల్లడించారు.

రోహింగ్యాలకు పాస్ పోర్టు ఇవ్వడమంటే ఉగ్రవాదులకు సాయం చేయడమేనని స్పష్టం చేశారు. ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ పెద్ద దొంగ అని, కేంద్రానికి అన్నీ అబద్ధాలు చెబుతున్నారని అరవింద్ విమర్శించారు. టీఆర్ఎస్ సర్కారు తెలంగాణ వ్యాప్తంగా దళిత బంధు అమలుకు సన్నద్ధమవుతున్న నేపథ్యంలో, బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ స్పందించారు. తెలంగాణ క్యాబినెట్ లో దళితులకు చోటు ఎక్కడ? అని ప్రశ్నించారు.