CPI Ramakrishna: కిషన్ రెడ్డిది జన వంచన యాత్ర: సీపీఐ రామకృష్ణ

CPI Ramakrishna comments on union minister Kishna Reddy
  • జన ఆశీర్వాద యాత్ర చేపడుతున్న కిషన్ రెడ్డి
  • మోదీ సర్కారుపై విమర్శలు చేసిన సీపీఐ రామకృష్ణ
  • ఏపీకి అడుగడుగునా అన్యాయమేనని వ్యాఖ్యలు
  • ఏపీ బీజేపీ నేతలు ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు
కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి చేపట్టిన జన ఆశీర్వాద యాత్రపై సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ విమర్శనాత్మకంగా స్పందించారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, కిషన్ రెడ్డిది జన వంచన యాత్ర అని ఆయన అభివర్ణించారు. మోదీ సర్కారు ఏపీకి అడుగడుగునా అన్యాయం చేసిందని అన్నారు. కార్పొరేట్ శక్తులకు మోదీ ప్రభుత్వం కొమ్ముకాస్తోందని వ్యాఖ్యానించారు.

ఏపీ అప్పులు చేసిందని చెబుతున్న కేంద్రం ఏడేళ్లలో రూ.47 లక్షల కోట్ల నుంచి రూ.119 లక్షల కోట్లకు అప్పులు పెంచడాన్ని ఏమనాలి? అని రామకృష్ణ ప్రశ్నించారు. కేంద్రం తీరుపై ఏపీ బీజేపీ నేతలు ఆత్మపరిశీలన చేసుకోవాలని అన్నారు.
CPI Ramakrishna
Kishan Reddy
Narendra Modi
BJP
Andhra Pradesh

More Telugu News