Ujjain: ఉజ్జయినిలో పాకిస్థాన్ అనుకూల నినాదాలు.. నలుగురి అరెస్ట్

Pakistan zindabad slogans in Ujjain
  • మధ్యప్రదేశ్ లో కలకలం రేపిన పాక్ అనుకూల నినాదాలు
  • మొహర్రం సందర్భంగా ఊరేగింపుకు యత్నించిన కొందరు 
  • అనుమతించకపోవడంతో.. పాకిస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలు
మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో పాకిస్థాన్ అనుకూల నినాదాలు కలకలం రేపాయి. ఖరాకువా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. మొహర్రం సందర్భంగా నిర్వహించిన ఊరేగింపులో కొందరు 'పాకిస్థాన్ జిందాబాద్' అంటూ నినాదాలు చేశారు. వాస్తవానికి కరోనా నేపథ్యంలో ఎలాంటి ఊరేగింపులకు అనుమతి లేదు.

ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం, మొహర్రం సందర్భంగా కొందరు గుర్రంపై ఊరేగింపుకు యత్నించారు. అయితే కోవిడ్ నిబంధనల వల్ల ఊరేగింపుకు అధికారులు అనుమతి ఇవ్వలేదు. దీంతో, వారు పాకిస్థాన్ అనుకూల నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి వెళ్లారు. నినాదాలు చేసిన వారిలో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన వారికోసం పోలీసులు గాలిస్తున్నారు.

Ujjain
Pakistan
Slogans

More Telugu News