కొడాలి నానిని అంకుశం సినిమాలో రామిరెడ్డిని కొట్టినట్టు కొట్టిస్తా: టీడీపీ నేత యరపతినేని

21-08-2021 Sat 12:46
  • టీడీపీ అధికారంలోకి వస్తే బజారులో కొడుతూ తీసుకెళ్తా
  • అధికారం శాశ్వతం కాదనే విషయాన్ని కొడాలి నాని గుర్తుంచుకోవాలి
  • చంద్రబాబు భిక్ష పెడితేనే నీవు ఎమ్మెల్యే అయ్యావు
Yarapathineni Srinivas gives strong warning to Kodali Nani

ఏపీ మంత్రి కొడాలి నానికి టీడీపీ సీనియర్ నేత, గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే... 'అంకుశం' సినిమాలో రామిరెడ్డిని కొట్టినట్టు కొట్టిస్తానని వ్యాఖ్యలు చేశారు. అధికారాన్ని అడ్డు పెట్టుకుని నోటికొచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని అన్నారు.

అధికారం శాశ్వతం కాదనే విషయాన్ని కొడాలి నాని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. గురజాల నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ పెట్టిన తెలుగుదేశం పార్టీ నుంచి నువ్వు వచ్చావని, చంద్రబాబు భిక్ష పెడితేనే నీవు ఎమ్మెల్యే అయ్యావని యరపతి మండిపడ్డారు. యరపతి వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఈ వ్యాఖ్యలపై కొడాలి నాని ఏ విధంగా ప్రతిస్పందిస్తారో వేచి చూడాలి.