Chiranjeevi: మెహర్ రమేశ్ దర్శకత్వంలో రానున్న చిరూ మూవీ అప్డేట్!

Chiranjeevi new movie update at tomorrow 9AM
  • రేపు చిరంజీవి పుట్టినరోజు
  • 'ఆచార్య' నుంచి రానున్న ఫస్టు గ్లింప్స్
  • 'లూసిఫర్' రీమేక్ నుంచి ప్రీ లుక్
  • మెహర్ రమేశ్ మూవీ ప్రకటన
  • లైన్లో బాబీ ప్రాజెక్టు
రేపు చిరంజీవి పుట్టినరోజు .. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సారి చిరంజీవి చేతిలో వరుసగా భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. ఆ ప్రాజెక్టులకు సంబంధించిన ప్రకటనలు .. ఫస్టు పోస్టర్లు .. ఫస్టు గ్లింప్స్ .. ఫస్టు సింగిల్ ఇలా వరుస అప్ డేట్లతో అంతా సందడి వాతావరణం నెలకొని ఉంది.

చిరంజీవి ఆల్రెడీ కొరటాల దర్శకత్వంలో 'ఆచార్య' సినిమా పూర్తి చేశారు. భారీ బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమా, ఇటీవలే షూటింగు పార్టును పూర్తిచేసుకుంది. రేపు ఈ సినిమా నుంచి ఫస్టు గ్లింప్స్ ను రిలీజ్ చేయనున్నారు. ఇక చిరంజీవి తన 153వ సినిమాగా 'లూసిఫర్' రీమేక్ ను చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి ఈ రోజు సాయంత్రం ప్రీ లుక్ ను వదలనున్నారు.

ఇక ఆ తరువాత ప్రాజెక్టు మెహర్ రమేశ్ తో ఉండనున్నట్టుగా వార్తలు వచ్చాయి. క్రియేటివ్ కమర్షియల్స్ తో కలిసి ఈ సినిమాను రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఈ ప్రొడక్షన్ నుంచి పోస్టర్ ను రిలీజ్ చేశారు. చిరూ బర్త్ డే సందర్భాన్ని పురస్కరించుకుని, రేపు ఉదయం 9 గంటలకు ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన ఉంటుందనే విషయాన్ని స్పష్టం చేశారు. ఇక బాబీ కూడా తన ప్రాజెక్టు విషయాలను వెల్లడించే అవకాశం ఉందని చెప్పుకుంటున్నారు.
Chiranjeevi
Mehar Ramesh
Anil Sunkara

More Telugu News