అప్పుల్లేని రైతులను చూడటమే ప్రభుత్వ ఆకాంక్ష: కేటీఆర్

21-08-2021 Sat 11:51
  • ఇప్పటి వరకు 35.19 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేశాం
  • రూ. 16,144.10 కోట్ల రుణాలను మాఫీ చేశాం
  • రైతు సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తుంది 
Want to see debt free farmers says KTR

రైతుల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తుందని తెలంగాణ మంత్రి కేటీఆర్ తెలిపారు. అప్పుల్లేని రైతులను చూడాలనేదే ప్రభుత్వ ఆకాంక్ష అని చెప్పారు. రూ. లక్ష వరకు రైతు రుణమాఫీ చేయాలనే నిర్ణయాన్ని 2014లో తీసుకున్నామని తెలిపారు. ఆ నిర్ణయం మేరకు ఇప్పటి వరకు 35.19 లక్షల మంది రైతులకు రూ. 16,144.10 కోట్ల రుణమాఫీ చేశామని చెప్పారు.

2018లో కూడా అలాంటి హామీనే రైతులకు తాము ఇచ్చామని తెలిపారు. కరోనా కష్టకాలంలో కూడా 9 లక్షల కంటే ఎక్కువ మంది రైతులకు రూ. 50 వేల వరకు రుణమాఫీ చేశామని చెప్పారు. 2014 నుంచి 2018 వరకు లక్ష రూపాయల లోపు రుణాలను మాఫీ చేశామని తెలిపారు. రుణమాఫీ చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్, వ్యవసాయమంత్రి సింగిరెడ్డిలకు ధన్యవాదాలు తెలుపుతున్నామని చెప్పారు.