తాలిబ‌న్లకు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించిన అష్రఫ్ ఘనీ సోద‌రుడు!

21-08-2021 Sat 11:44
  • ప్ర‌భుత్వ ఏర్పాటుకు తాలిబన్ల ప్ర‌య‌త్నాలు
  • వాళ్లతో క‌లిసిపోయిన‌ అష్ర‌ఫ్ సోద‌రుడు హ‌ష్మ‌త్ ఘ‌నీ
  • ప్ర‌స్తుతం యూఏఈలో అష్ర‌ఫ్ ఘ‌నీ  
ashraf ghani brother supports talibans

ఆఫ్ఘనిస్థాన్ మొత్తం తాలిబ‌న్ల చేతుల్లోకి వెళ్లిపోవ‌డంతో ఆ దేశ  అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ విదేశాల‌కు పారిపోయిన విష‌యం తెలిసిందే. ఆఫ్ఘ‌న్‌లో తాలిబ‌న్లు ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్ర‌య‌త్నాలు కొన‌సాగిస్తోన్న నేప‌థ్యంలో అష్ర‌ఫ్ ఘ‌నీ  సోదరుడు, గ్రాండ్ కౌన్సిల్ చీఫ్ హష్మత్ ఘనీ అహ్మద్ జాయ్ తాలిబాన్లకు మద్ద‌తు ప్రక‌టించిన‌ట్లు తెలిసింది.

తాలిబాన్ నాయకుడు ఖలీల్ ఉర్ రెహ్మాన్, మతాధికారి ముఫ్తీ మహమూద్ జాకీర్ ల సమక్షంలో హష్మత్ ఘనీ ఇందుకు సంబంధించి ప్ర‌తిజ్ఞ చేశారు. ప్ర‌స్తుతం అష్ర‌ఫ్ ఘ‌నీ.. కుటుంబంతో పాటు యూఏఈలో ఉన్నారు. కాగా, ఆఫ్ఘ‌న్‌లో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసి, ష‌రియా చ‌ట్టాల‌ను అమ‌లు చేసే ప‌నుల్లో తాలిబ‌న్లు ప్ర‌స్తుతం బిజీగా ఉన్నారు.