షూటింగు బ్రేక్ లో 'భీమ్లా నాయక్' .. స్పెషల్ వీడియో!

21-08-2021 Sat 10:54
  • షూటింగు దశలో 'భీమ్లా నాయక్'
  • విరామ సమయంలో పవన్ ఫైరింగ్ ప్రాక్టీస్
  • పవన్ బర్త్ డేకి ఫస్టు సింగిల్ 
  • సంక్రాంతికి సినిమా రిలీజ్  
Special Video from Bheemla Nayak movie

పవన్ కల్యాణ్ కథానాయకుడిగా 'భీమ్లా నాయక్' రూపొందుతోంది. సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, ప్రస్తుతం షూటింగు దశలో ఉంది. పవన్ కాంబినేషన్లోని సన్నివేశాలను చిత్రీకరిస్తూ వస్తున్నారు. ఇటీవల ఈ సినిమా నుంచి వదిలిన ఫస్టు గ్లింప్స్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. పవన్ పాత్ర స్వరూప స్వభావాలు ఎలా ఉంటాయనేది అందులో చూపించారు. 'భీమ్లా నాయక్' పాత్రలో ఆయన ఆవేశం .. దూకుడు అందరికీ నచ్చింది.

తాజాగా ఈ సినిమా టీమ్ మరో స్పెషల్ వీడియోను వదిలింది. అయితే ఇది సినిమా కోసం చేసిందికాదు. షూటింగు విరామ సమయంలో పవన్ ఫైరింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా, ఈ సినిమా టీమ్ కెమెరాలో బంధించింది. షూటింగు విరామ సమయంలో 'భీమ్లా నాయక్' అంటూ ఈ వీడియోను వదిలారు.

సరదాగా చేసిన వీడియో ద్వారానే, ఆయన పాత్ర స్వభావాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. నిజమైన నాయకుడిలో యోగి .. యోధుడు ఇద్దరూ ఉంటారని చెప్పుకొచ్చారు. సెప్టెంబర్ 2వ తేదీన పవన్ పుట్టిన రోజున ఫస్టు సింగిల్ ను రిలీజ్ చేయనున్నారు. మరో ప్రధానమైన పాత్రలో రానా నటిస్తున్న ఈ సినిమాను, 'సంక్రాంతి' కానుకగా జనవరి 12వ తేదీన విడుదల చేయనున్నారు.