China: చైనాలో ముగ్గురు పిల్లల్ని కనేందుకు గ్రీన్ సిగ్నల్.. సవరణ చట్టానికి పార్లమెంటు ఆమోదం

  • దేశంలో దారుణంగా పడిపోతున్న జననాల రేటు
  • పెరుగుతున్న ఖర్చుల కారణంగా అధిక సంతానానికి దంపతుల విముఖత
  • ఖర్చులు తగ్గించి వెసులుబాటు కల్పించడమే లక్ష్యంగా తాజా ప్రతిపాదన
China Approves 3 Child Policy With Sops To Encourage Couples To Have More Children

దేశంలో దారుణంగా పడిపోతున్న జననాల రేటును తిరిగి పెంచేందుకు చైనా ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ఇకపై ప్రతి ఒక్కరు ముగ్గురు పిల్లల్ని కనేందుకు అధికార కమ్యూనిస్ట్ పార్టీ తీసుకొచ్చిన ప్రతిపాదనకు ఆ దేశ పార్లమెంట్ ‘నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్’ (ఎన్‌పీసీ) స్థాయీ సంఘం నిన్న గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి తగ్గట్టుగా కుటుంబ నియంత్రణ చట్టానికి సవరణ చేసింది.

పెరుగుతున్న ఖర్చుల నేపథ్యంలో అధిక సంతానానికి ప్రజలు విముఖత వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం తాజా ప్రతిపాదన తీసుకొచ్చింది. కుటుంబాలపై పడే భారం, పిల్లలను పెంచేందుకు, చదువుకు అయ్యే వ్యయాలను తగ్గించడంతోపాటు ఆర్థిక సాయం కల్పించడమే లక్ష్యంగా ఈ ప్రతిపాదనను తీసుకొచ్చింది. కాగా, ఈ ఏడాది మేలో ఇద్దరు పిల్లల విధానాన్ని సడలించాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ముగ్గురు పిల్లల్ని కనేందుకు అనుమతి నిచ్చింది.

  • Loading...

More Telugu News