‘సూపర్ డ్యాన్సర్ 4’ సెట్స్‌లో శిల్పా శెట్టి కంటతడి

20-08-2021 Fri 22:11
  • పోర్నోగ్రఫీ కేసులో అరెస్టయిన శిల్ప భర్త రాజ్ కుంద్రా
  • అప్పటి నుంచి లోప్రొఫైల్ మెయింటెయిన్ చేస్తున్న సినీ నటి
  • ఆగస్టు 17న డ్యాన్స్ రియాలిటీ షో షూటింగ్
  • ఆత్మీయ ఆహ్వానంతో కంటతడి
Shilpa Shetty in tears on the sets of Super Dance 4
‘సాగర కన్య’గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బాలీవుడ్ నటి శిల్పా శెట్టి.. తాను జడ్జిగా వ్యవహరించే ‘సూపర్ డ్యాన్సర్ 4’ రియాలిటీ షో సెట్స్‌లో కంటతడి పెట్టారు. పోర్నోగ్రఫీ కేసులో ఆమె భర్త రాజ్‌కుంద్రా జులై 19న అరెస్టయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి మీడియాకు దూరంగా ఉంటున్న శిల్ప.. తన పని నుంచి కూడా విరామం తీసుకున్నారు. ఇటీవలే పిల్లల కోసమే కాకుండా, తన మనశ్శాంతి కోసం కూడా పని అవసరమని భావించిన ఆమె.. ఆగస్టు 17న జరిగిన 'సూపర్ డ్యాన్సర్ 4' షూటింగ్‌లో పాల్గొన్నారు.

ఆ సందర్భంగా తనకు లభించిన ఆత్మీయ ఆహ్వానానికి ఆమె మనసు కరిగిపోయింది. దీంతో ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ షోలో శిల్పతోపాటు జడ్జిలుగా వ్యవహరిస్తున్న అనురాగ్ బసు, గీతా కపూర్ ఆమెను ఓదార్చారు. ‘ఇది చాలా చిన్న కుటుంబం. ఒక్కరు లేకపోయినా చాలా కష్టంగా ఉంటుంది. శిల్ప మాకు చాలా ఆత్మీయురాలు’ అని ఇంతకు ముందు ఒక ఇంటర్వ్యూలో అనురాగ్ బసు చెప్పిన సంగతి తెలిసిందే.