Chiranjeevi: చిరూ 153వ మూవీ 'టైటిల్ పోస్టర్' రిలీజ్ కి ముహూర్తం ఖరారు!

  • చిరూ 153వ సినిమాగా 'లూసిఫర్' రీమేక్
  • త్వరలోనే సెట్స్ పైకి వెళ్లే దిశగా పనులు
  • దర్శకుడిగా మోహన్ రాజా
  • రేపు సాయంత్రం టైటిల్ పోస్టర్ రిలీజ్
Chiru new movie update

చిరంజీవి కథానాయకుడిగా 'లూసిఫర్' రీమేక్ రూపొందనుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. కెరియర్ పరంగా చిరంజీవికి ఇది 153వ సినిమా. తమిళ దర్శకుడు మోహన్ రాజా ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఆర్ బీ చౌదరి - ఎన్వీ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తుండగా, చరణ్ కూడా ఒక భాగస్వామిగా ఉన్నాడు. ఈ సినిమాకి 'గాడ్ ఫాదర్' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.

అయితే ఈ 22వ తేదీన చిరంజీవి పుట్టినరోజు కావడంతో, ఆ రోజున ఈ సినిమాకి సంబంధించిన అప్ డేట్ రావొచ్చని అనుకున్నారు. అభిమానుల అంచనాలకు తగినట్టుగానే, ఈ సినిమా టైటిల్ ను రివీల్ చేయనున్నారు. అందుకు సంబంధించిన ప్రకటన ఇచ్చేశారు. రేపు సాయంత్రం 5:04 నిమిషాలకు ఈ సినిమా టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేయనున్నారు. ఫస్టులుక్ తో కూడిన టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేసే అవకాశం కూడా ఉంది. తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు.

More Telugu News