Gorantla Butchaiah Chowdary: గోరంట్ల బుచ్చయ్య చౌదరితో చర్చలు జరిపిన టీడీపీ త్రిసభ్య బృందం

TDP tri member committee met Gorantla at his house in Rajamundry
  • టీడీపీలో గోరంట్ల కలకలం
  • రాజీనామా చేస్తారంటూ వార్తలు
  • అప్రమత్తమైన టీడీపీ అధిష్ఠానం
  • గోరంట్ల వద్దకు త్రిసభ్య బృందం
గోరంట్ల బుచ్చయ్య చౌదరి అలకబూనిన వ్యవహారంపై టీడీపీ హైకమాండ్ తీవ్రస్థాయిలో దృష్టి సారించింది. గోరంట్లతో చర్చలు జరిపేందుకు త్రిసభ్య బృందాన్ని రాజమండ్రి పంపింది. ఈ బృందంలో సీనియర్ నేతలు నిమ్మకాయల చినరాజప్ప, జవహర్, గద్దె రామ్మోహన్ ఉన్నారు. ఈ త్రిసభ్య బృందం గోరంట్లతో గంటన్నరసేపు చర్చలు జరిపింది.

అనంతరం గద్దె రామ్మోహన్ మీడియాతో మాట్లాడుతూ, రాజమండ్రిలో తనకు ఎదురవుతున్న ఇబ్బందుల గురించి గోరంట్ల చెప్పారని వెల్లడించారు. గోరంట్ల సమస్యలను రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్వయంగా పరిశీలిస్తున్నారని తెలిపారు. గోరంట్ల తెలియజేసిన అభిప్రాయాలను పార్టీ అధినేత చంద్రబాబు పరిగణనలోకి తీసుకుంటారని గద్దె స్పష్టం చేశారు. ఇవన్నీ చిన్న చిన్న సమస్యలేనని, పరిష్కరించుకుంటామని పేర్కొన్నారు.
Gorantla Butchaiah Chowdary
TDP
Rajamundry
Andhra Pradesh

More Telugu News