Bandla Ganesh: హీరోగా మారుతున్న బండ్ల గణేశ్

Bandla Ganesh turns hero
  • తమిళంలో హిట్టయిన ఒత్త సెరుప్పు సైజ్ 7
  • స్వీయదర్శకత్వంలో నటించిన పార్తిబన్
  • తెలుగులో వెంకట్ చంద్ర దర్శకత్వంలో రీమేక్
  • హీరోగా బండ్ల గణేశ్
  • సెప్టెంబరు తొలివారంలో షూటింగ్
కామెడీ నటుడిగా కెరీర్ ప్రారంభించి, పవన్ కల్యాణ్ వంటి అగ్రహీరోలతో సినిమాలు నిర్మించే స్టార్ ప్రొడ్యూసర్ స్థాయికి ఎదిగిన బండ్ల గణేశ్ ఇప్పుడు హీరోగా వస్తున్నాడు. తమిళంలో ప్రజాదరణ పొందిన 'ఒత్త సెరుప్పు సైజ్ 7' అనే చిత్రాన్ని బండ్ల గణేశ్ హీరోగా తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రం ద్వారా వెంకట్ చంద్ర అనే దర్శకుడు టాలీవుడ్ కు పరిచయం అవుతున్నాడు. యశ్ రిషి ఫిలింస్ బ్యానర్ పై స్వాతి చంద్ర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సెప్టెంబరు తొలి వారంలో ఇది సెట్స్ పైకి వెళ్లనుంది.  

కాగా, 'ఒత్త సెరుప్పు సైజ్ 7' చిత్రంలో పార్తిబన్ వంటి సీనియర్ నటుడు స్వీయదర్శకత్వంలో హీరోగా నటించారు. ఈ సినిమాతో పార్తిబన్ నేషనల్ అవార్డుతో పాటు స్పెషల్ జ్యూరీ పురస్కారానికి కూడా ఎంపికయ్యారు. విశేషం ఏంటంటే.... ఇదే చిత్రాన్ని బాలీవుడ్ లో అభిషేక్ బచ్చన్ హీరోగా తెరకెక్కిస్తున్నారు. అలాంటి సినిమా ద్వారా బండ్ల గణేశ్ హీరో కానుండడం ప్రత్యేకమైన విషయం అని చెప్పాలి.
Bandla Ganesh
Hero
Tamil Remake
Venkat Chandra
Oththa Seruppu Size 7

More Telugu News