ఐఎఫ్ఎఫ్ఎం అవార్డులు.. ఉత్తమ నటుడిగా సూర్య, ఉత్తమ నటిగా సమంత

20-08-2021 Fri 15:34
  • ఉత్తమ చిత్రంగా 'సూరరై పొట్రు'
  • ఉత్తమ వెబ్ సిరీస్ 'ఫ్యామిలీ మ్యాన్ 2'
  • 'ఫ్యామిలీ మ్యాన్ 2'లో నటించిన సమంత
Samantha is best actress in IFFM awards

సినీ నటులు ప్రతిష్ఠాత్మకంగా భావించే ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్ బోర్న్ అవార్డులు వెలువడ్డాయి. 2021 సంవత్సరానికి గాను ఐఎఫ్ఎఫ్ఎం అవార్డులను ప్రకటించింది. ఉత్తమ చిత్రంగా సూర్య నటించిన 'సూరరై పొట్రు' (ఆకాశం నీ హద్దురా) చిత్రం ఎంపికైంది. ఉత్తమ నటుడిగా సూర్య ఎంపికయ్యారు.

ఇక ఉత్తమ నటిగా విద్యా బాలన్ (షేర్నీ) ఎంపికయ్యారు. ఉత్తమ వెబ్ సిరీస్ గా 'ఫ్యామిలీ మ్యాన్ 2' ఎంపికైంది. వెబ్ సిరీస్ ఉత్తమ నటీనటులుగా సమంత, మనోజ్ బాజ్ పాయ్ ఎంపికయ్యారు. వీరిద్దరూ 'ఫ్యామిలీ మ్యాన్ 2'లో నటించారు. 27 భాషలకు చెందిన 120కి పైగా చిత్రాలు అవార్డుల కోసం పోటీ పడ్డాయి.