Russian Women: గోవాలో ఇద్దరు రష్యా యువతుల మృతదేహాలు లభ్యం

Two Russian girls died in Goa
  • గోవాలో మృతదేహాల కలకలం
  • విహారయాత్ర కోసం భారత్ వచ్చిన యువతులు
  • లాక్ డౌన్ తో గోవాలోనే నిలిచిపోయిన వైనం
  • మిస్టరీగా మారిన మృతి కేసు
ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా గుర్తింపు పొందిన గోవాలో మృతదేహాల కలకలం రేగింది. గోవాలోని శివోలీ మపుసా ప్రాంతం వద్ద ఇద్దరు రష్యా యువతులు అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. విహారయాత్ర కోసం వారు కొన్నాళ్ల కిందట భారత్ వచ్చారు. అయితే దేశంలో లాక్ డౌన్ కారణంగా ఆ రష్యా యువతులు గోవాలోనే ఉండిపోయారు.

ఇప్పుడు వారిద్దరూ శవాలై తేలారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న గోవా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా, మరణించిన వారిని ఎక్తెరినా టికోవా, అలెగ్జాండ్రా రిజావిగా గుర్తించారు. వారిద్దరూ తమ గదుల్లో విగతజీవులై పడి ఉండగా గుర్తించారు.
Russian Women
Death
Goa
Police
India

More Telugu News