Kathleen: మైఖేల్ జాక్సన్ ఆత్మ తనను పెళ్లి చేసుకుందంటున్న బ్రిటన్ మహిళ!

British woman says Michael Jackson spirit married her
  • 2009లో మైఖేల్ జాక్సన్ మృతి
  • జాక్సన్ ఆత్మ తనలో ప్రవేశించిందన్న కాథ్లీన్
  • తనలో ఉండి అన్ని పనులు చేస్తుందని వెల్లడి
  • శృంగారం మాత్రం చేయదని వివరణ
పాప్ సంగీత ప్రపంచంలో రారాజుగా కీర్తి పొందిన మైఖేల్ జాక్సన్ 12 ఏళ్ల కిందట గుండెపోటుతో మరణించాడు. అయితే, మైఖేల్ జాక్సన్ ఆత్మగా మారి తనను పెళ్లి చేసుకున్నాడని బ్రిటన్ కు చెందిన ఓ మహిళ ఇప్పుడు చెబుతోంది. ఆమె పేరు కాథ్లీన్ రాబర్ట్స్. తాను ఓ దెయ్యంతో కలిసి జీవిస్తున్నానని, ఆ దెయ్యం ఎవరో కాదని మైఖేల్ జాక్సన్ అని పేర్కొంది. జాక్సన్ తన శరీరంలోనే ఆవాసం ఏర్పరచుకుని ఉన్నాడని వివరించింది.

పాప్ కింగ్ ఆత్మ తన శరీరంలో ఉంటూ శృంగారం తప్ప అన్ని పనులు చేస్తుందని వెల్లడించింది. ఒకవేళ తాను శృంగారానికి ప్రయత్నిస్తే జాక్సన్ సాలె పురుగుల నీడలు, శవాల ఆకారాలతో తనను భయభ్రాంతులకు గురిచేస్తాడని అంటోంది. డ్యాన్స్ చేయడం, పాటలు పాడడం, తనకిష్టమైన కుకీస్ తినడం... ఇలా తనకు నచ్చిన విధంగా ఆస్వాదిస్తుంటాడని తెలిపింది. సాధారణంగా మైఖేల్ జాక్సన్ ఎంతో సిగ్గరి అని, కానీ తనతో మాత్రం ఎలాంటి అరమరికలు లేకుండా అనేక విషయాలు మాట్లాడుతుంటాడని కాథ్లీన్ వివరించింది.

కాథ్లీన్ చెప్పిన విషయాలు బ్రిటన్ మీడియాలో కథనాల రూపంలో వచ్చాయి. అయితే చాలామంది ఆమె అనుభవాలను కొట్టిపారేస్తున్నారు. ఆమె ఏదో భ్రాంతిలో ఉండి మాట్లాడుతోందంటూ తోసిపుచ్చారు. కాగా ఈ బ్రిటీష్ మహిళ గతంలో తాను హాలీవుడ్ తార మార్లిన్ మన్రో నంటూ ప్రకటించుకుంది. పునర్జన్మలను తాను నమ్ముతానని, మార్లిన్ మన్రోగా అభిమానుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న తాను ఈ జన్మలో బ్రిటన్ లో జన్మించానని తెలిపింది.
Kathleen
Michael Jackson
Ghost
Britain

More Telugu News