Madhya Pradesh: పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెరుగుద‌ల‌పై ప్ర‌శ్నిస్తే 'ఆఫ్ఘ‌నిస్థాన్ వెళ్లిపో' అంటూ జ‌వాబిచ్చిన బీజేపీ నేత‌.. వీడియో ఇదిగో

  • మధ్యప్రదేశ్‌ బీజేపీ నేత రామ్‌రతన్‌ పాయల్‌ వివాదాస్పద వ్యాఖ్యలు
  • ఆఫ్ఘ‌నిస్థాన్లో పెట్రోల్ లీట‌రు రూ.50కే దొరుకుతుందని వ్యాఖ్య
  • భార‌త్‌ ఎలాంటి ప‌రిస్థితుల్లో ఉందో తెలుసా? అంటూ ఎదురు ప్ర‌శ్న‌
goto afghan says bjp leader

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రోజురోజుకీ పెరిగిపోతుండ‌డంతో సామాన్యుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోన్న విష‌యం తెలిసిందే. క‌రోనాతో ఉపాధి కోల్పోయి ఎన్నో క‌ష్టాలు ఎదుర్కొంటోన్న సామాన్యుడికి పెట్రోలు ధ‌ర‌ల పెంపు మ‌రింత భారం కావ‌డంతో కేంద్ర ప్ర‌భుత్వంపై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

తాజాగా, ఇదే విష‌యంపై ప్ర‌శ్నించిన మీడియాపై మధ్యప్రదేశ్‌కు చెందిన బీజేపీ నేత రామ్‌రతన్‌ పాయల్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేయ‌డం దుమారం రేపుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో వైర‌ల్ అవుతోంది.

పెట్రోల్‌, డీజిల్‌ తక్కువ ధరకు కావాలంటే తాలిబన్‌ పాలిత ఆఫ్ఘ‌నిస్థాన్‌కు వెళ్లాల‌ని ఆయ‌న సూచించారు. అక్కడ చౌకగా పెట్రోల్‌ దొరుకుతుందని, పెట్రోల్ లీట‌రుకు రూ.50కే వస్తుందని వ్యాఖ్యానించారు. దేశంలో కరోనా రెండు ద‌శ‌ల్లో విజృంభించింద‌ని, మూడో ద‌శలోనూ వ్యాప్తి చెంద‌నుంద‌ని ఆయన చెప్పారు. భార‌త్ ప్ర‌స్తుతం ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంటుందో తెలుసా? అంటూ నిల‌దీశారు. ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌పై ప్ర‌తిప‌క్ష నేత‌లు మండిప‌డుతున్నారు.

More Telugu News