అల్లు అర్జున్ తో పరశురామ్ మూవీ!

20-08-2021 Fri 11:34
  • సెట్స్ పై 'సర్కారువారి పాట'
  • తదుపరి సినిమా నాగచైతన్యతో
  • అల్లు అర్జున్ తో చేయాలనే ఆలోచన
  • ఆ దిశగా మొదలైన ప్రయత్నాలు
Parasuram movie with Allu Arjun
మహేశ్ బాబు కథానాయకుడిగా పరశురామ్ 'సర్కారువారి పాట' సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా చకచకా షూటింగు జరుపుకుంటోంది. భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మితమవుతోంది. కీర్తి సురేశ్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను, 'సంక్రాంతి' పండుగ సందర్భంగా జనవరి 13వ తేదీన విడుదల చేయనున్నారు.

ఆ తరువాత నాగచైతన్యతో పరశురామ్ సినిమా ఉండనుంది. ఈ సినిమాకి సంబంధించిన అన్ని పనులను ఆల్రెడీ పరశురామ్ రెడీ చేసిపెట్టుకున్నాడు. అందువలన ఈ ప్రాజెక్టు పట్టాలపైకి వెళ్లడానికి ఎక్కువ సమయం పట్టదు. అందువలన ఆ తరువాత ప్రాజెక్టును కూడా ఆయన లైన్లో పెట్టే పనిలో ఉన్నాడనే టాక్ వినిపిస్తోంది.

'గీత గోవిందం' సినిమా భారీ విజయాన్ని నమోదు చేసిన దగ్గర నుంచి గీతా ఆర్ట్స్ వారితో పరశురామ్ కి మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. ఆయనపై వారికి నమ్మకం కూడా కుదిరింది. అందువలన అల్లు అర్జున్ తో ఒక సినిమా చేసే దిశగా పనులను పరశురామ్ లైన్లో పెడుతున్నాడని అంటున్నారు. ఆయన ప్రయత్నాలు ఎంతవరకూ ఫలిస్తాయో చూడాలి మరి.