Panja Vaisshnav Tej: 'కొండ పొలం' నుంచి వైష్ణవ్ తేజ్ ఫస్టులుక్!

  • వైష్ణవ్ తేజ్ నుంచి మరో సినిమా
  • 'కొండ పొలం' టైటిల్ ఖరారు
  • సంగీత దర్శకుడిగా కీరవాణి
  • అక్టోబర్ 8వ తేదీన విడుదల  
Kondapolam movie first look released

ఇటీవల కాలంలో స్టార్ డైరెక్టర్లు భారీ ప్రాజెక్టులను ఎక్కువగా ఒప్పుకుంటున్నారు. అయితే అవి షూటింగు పూర్తి చేసుకుని ప్రేక్షకుల ముందుకు రావడానికి చాలా సమయమే పడుతుంది. ఈ లోగా ప్రేక్షకులతో గ్యాప్ వచ్చేస్తోంది. అందువలన సినిమాకి సినిమాకి మధ్య ఏ మాత్రం గ్యాప్ దొరికినా వెంటనే వాళ్లు ఒక చిన్న సినిమాను చేస్తున్నారు.

అలా దర్శకుడు క్రిష్ 'కొండ పొలం' అనే ఒక సినిమాను చేశారు. వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా ఆయన ఈ సినిమాను రూపొందించారు. కేవలం 40 రోజుల్లో ఆయన ఈ సినిమాను పూర్తిచేశారట. రకుల్ ప్రీత్ కీలకమైన పాత్రను పోషించిన ఈ సినిమా, చాలా రోజుల క్రితమే పూర్తయినా సరైన విడుదల తేదీ కోసం ఎదురుచూస్తోంది.

రాజీవ్ రెడ్డి - సాయిబాబు నిర్మిస్తున్న ఈ సినిమాకి కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు. తాజాగా ఈ సినిమాకి 'కొండ పొలం' అనే టైటిల్ ను ఖరారు చేశారు. అలాగే ఈ సినిమాను అక్టోబర్ 8వ తేదీన విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. అందుకు సంబంధించిన అధికారిక పోస్టర్ ను రిలీజ్ చేశారు.

More Telugu News