పరిటాల సిద్ధార్థ బ్యాగులో తూటా.. శంషాబాద్ విమానాశ్రయంలో కలకలం

20-08-2021 Fri 08:54
  • స్నేహితులతో కలిసి శ్రీనగర్ వెళ్తుండగా ఘటన
  • తనిఖీల్లో కనిపించిన 5.5 ఎంఎం తూటా
  • కేసు నమోదు చేసిన పోలీసులు
Shamshabad Police found bullet in Parital Siddhartha Bag

ఏపీ మాజీ మంత్రి పరిటాల సునీత తనయుడు సిద్ధార్థ బ్యాగులో  5.5 ఎంఎం బుల్లెట్ లభించడం కలకలం రేపింది. సిద్ధార్థ నిన్న తన స్నేహితులతో కలిసి శ్రీనగర్ వెళ్లేందుకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయ అధికారులు ఆయన బ్యాగును స్క్రీనింగ్ చేస్తున్న సమయంలో అందులో తూటా ఉన్నట్టు గుర్తించారు. బుల్లెట్‌ను స్వాధీనం చేసుకుని ఎయిర్‌పోర్టు పోలీసులకు అప్పగించారు. సిద్ధార్థపై కేసు నమోదు చేసిన పోలీసులు దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. అయితే, ఈ బుల్లెట్‌కు, తనకు ఎలాంటి సంబంధం లేదని సిద్ధార్థ చెప్పినట్టు తెలుస్తోంది.