Narendra Modi: పూణేలో మోదీ గుడి నుంచి విగ్రహం తొలగింపు!

  • అర్ధరాత్రి తొలగించిన అధికారులు
  • మోదీపై భక్తితో కట్టిన బీజేపీ కార్యకర్త
  • 1.6 లక్షలతో ఆలయ నిర్మాణం
  • అయోధ్యలో రామాలయం కట్టే వ్యక్తికి గుడి ఉండాలన్న రియల్ ఎస్టేట్ వ్యాపారి
Removal of idol from Modi temple

మహారాష్ట్రలోని పూణేలో ఒక బీజేపీ కార్యకర్త ప్రధాన మంత్రి మోదీకి గుడి కట్టాడు. అయోధ్యలో రామాలయం నిర్మిస్తున్న వ్యక్తికి గుడి ఉండాలనే భావనతోనే తాను ఈ ఆలయాన్ని నిర్మించినట్లు పూణేకు చెందిన 37 ఏళ్ల మయూర్ ముండే చెప్పారు. దీనికితోడు ట్రిపుల్ తలాక్ రద్దు, కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు వంటి విప్లవాత్మక నిర్ణయాలు కూడా ఈ ఆలయ నిర్మాణానికి కారణాలేనని చెప్పాడు. ఈ గుడి కోసం ఆయన రూ. 1,60,000 వెచ్చించాడు. 

 అయితే, ఈ గుడి విషయం మీడియాలో రావడంతో ప్రధాన మంత్రి కార్యాలయం స్పందించింది. ఇది ఆమోదయోగ్యం కాదంటూ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో బుధవారం రాత్రి ఆలయంలోని మోదీ విగ్రహాన్ని తొలగించారు. ప్రస్తుతం ఈ విగ్రహం స్థానిక బీజేపీ కౌన్సిలర్ ఇంట్లో ఉన్నట్లు సమాచారం.

కాగా, పూణేలో వచ్చే ఏడాది ప్రారంభంలోనే మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఎన్సీపీ కార్యకర్తలు గురువారం ఈ గుడికెళ్లి ‘భోగ్’ (ప్రసాదం) సమర్పిస్తామని ప్రకటించారు. ఈ రాజకీయాలు మరింత తీవ్రరూపం దాల్చకముందే ఆలయంలోని మోదీ విగ్రహాన్ని తొలగించారు.

More Telugu News