Kishan Reddy: కిషన్ రెడ్డి దంపతులను సత్కరించిన సీఎం జగన్ దంపతులు

Kishan Reddy met CM Jagan at Tadepally camp office
  • ఏపీలో కిషన్ రెడ్డి జన ఆశీర్వాద యాత్ర
  • ఈ సాయంత్రం తాడేపల్లి రాక
  • సాదరంగా స్వాగతం పలికిన సీఎం జగన్ దంపతులు
  • వెంకన్న ప్రతిమ, పట్టువస్త్రాల బహూకరణ
కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఏపీలో జన ఆశీర్వాద యాత్ర ముగించుకున్న అనంతరం సీఎం జగన్ ను కలిశారు. కుటుంబ సభ్యులతో సహా కిషన్ రెడ్డి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి విచ్చేశారు. కిషన్ రెడ్డి దంపతులకు సీఎం జగన్, వైఎస్ భారతి దంపతులు సాదరంగా స్వాగతం పలికారు. వారికి ఆత్మీయ సత్కారం చేశారు. కిషన్ రెడ్డి దంపతులకు వెంకటేశ్వరస్వామి ప్రతిమను బహూకరించారు. పట్టువస్త్రాలు అందజేశారు.

ఏపీలో పర్యటన ముగించుకున్న అనంతరం కిషన్ రెడ్డి హైదరాబాద్ పయనమయ్యారు. తెలంగాణలో ఆయన జన ఆశీర్వాద యాత్ర కొనసాగనుంది.
Kishan Reddy
CM Jagan
Camp Office
Andhra Pradesh

More Telugu News