Ghulam Hassan Lone: జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదుల ఘాతుకం... అప్నీ పార్టీ నేత గులాం హసన్ లోన్ మృతి

Terrorists killed Apni party leaders Ghulam Hassan Lone
  • కశ్మీర్ లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు
  • హసన్ లోన్ నివాసం వద్ద కాల్పులు
  • కుప్పకూలిన నేత
  • సంతాపం తెలిపిన మెహబూబా, ఒమర్
జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదులు పేట్రేగిపోయారు. ఏకంగా ఓ రాజకీయ పార్టీ నాయకుడిని బలిగొన్నారు. అప్నీ పార్టీ నేత గులాం హసన్ లోన్ పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆయన ప్రాణాలు వదిలారు. కుల్గాం జిల్లా దేవ్ సర్ లోని హసన్ లోన్ నివాసం వద్ద ఈ ఘటన జరిగింది. ఈ సాయంత్రం కొందరు సాయుధులు ఆయన ఇంటి వద్ద తుపాకులతో విరుచుకుపడ్డారు. ఈ కాల్పుల్లో లోన్ కుప్పకూలారు. దాంతో ఆయనను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్టు వైద్యులు తెలిపారు.

హసన్ లోన్ 4 నెలల కిందటే అప్నీ పార్టీలో చేరారు. ఆయన గతంలో మెహబూబా ముఫ్తీ నాయకత్వంలోని పీపుల్స్ డెమొక్రాటిక్ పార్టీ (పీడీపీ)లో కొనసాగారు. హసన్ లోన్ మృతిపై మాజీ సీఎంలు మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లా సంతాపం వ్యక్తం చేశారు.
Ghulam Hassan Lone
Death
Terrorists
Jammu And Kashmir

More Telugu News